![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -406 లో.. నువ్వు తీసుకున్న నిర్ణయం నచ్చలేదని అపర్ణతో సుభాష్ అంటాడు. ఇదంతా చేస్తుంది వాడు నిజం చెప్పాలని.. వాడికి నచ్చిన అమ్మాయితో ఆ బిడ్డ తల్లితో పెళ్లి చేస్తాను.. పాపం కావ్య మాత్రం సంతోషంగా ఉంటుంది.. తనకి న్యాయం చేసిన దాన్ని అవుతాను కానీ ఈ రాజ్ ఏం చేసిన నిజం చెప్పట్లేదు.. అందుకే నాకు విలువ లేని చోట ఈ ఇంట్లో ఉండను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అపర్ణ అంటుంది.
మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. ఆ రాజ్ వెళ్ళిపోతాడని అనుకుంటే అత్తయ్య వెళ్ళిపోతాను అంటుంది.. రాజ్ ఉంటే ఇక పెత్తనం మొత్తం వాడిదే అని రుద్రాణితో రాహుల్ అంటాడు. ఏ తప్పు చెయ్యని వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళాలని రాజ్ ని రెచ్చగొట్టి నేనే బయటకు పంపిస్తానని రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ తన తల్లి ఎక్కడ బయటకు వెళ్తుందోనని ఎమోషనల్ అవుతాడు. తనని అలా చూసిన కావ్య కూడా బాధపడుతుంది. ఆ తర్వాత అత్తయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా నేను చేస్తానని రాజ్ కి కావ్య చెప్తుంది. మరోవైపు అనామిక తనని తన భర్త అత్తయ్య పట్టించుకోవడం లేదని ఆలోచిస్తూ... హాల్లో ఉన్న ధాన్యలక్ష్మి దగ్గరికి అనామిక వెళ్తుంది. అలా అనామిక రాగానే ధాన్యలక్ష్మి వెళ్తుంటుంది. నేను చేసిన తప్పుకి మీరు మీ అబ్బాయి నన్ను దూరం పెడుతున్నారని అనామిక యాక్ట్ చేస్తూ ఏడుస్తుంది. దానికి ధాన్యలక్ష్మి కరిగిపోయి నీకు నేను ఉన్నానని చెప్తుంది. మీరు నా దారిలోకి వచ్చారు.. ఇక మీ అబ్బాయిని నా దారిలోకి తెచ్చుకోవాలని అనామిక అనుకుంటుంది.
ఆ తర్వాత స్వప్న దగ్గరున్నా కోటి రూపాయలు కొట్టేయ్యాలని రాహుల్, రుద్రాణి ఇద్దరు ప్లాన్ చేస్తారు. స్వప్న పడుకున్న తర్వాత ఇద్దరు దుప్పట్లు కప్పుకొని స్వప్న గదిలోకి వస్తారు. స్వప్న కొంగుకి ఉన్న కీ రాహుల్ తీసుకుంటాడు. ఆ తర్వాత స్వప్న నిద్ర నుండి లేచి.. మా అమ్మనాన్నల పరువు తీస్తావా అంటూ నిద్రలో మాట్లాడినట్టు వాళ్ళని భయపెడుతుంది. అలాగే ఇద్దరినీ కొడుతుంది. దాంతో వాళ్ళు ఇద్దరు గదిలో నుండి వెళ్లిపోతారు. నా డబ్బు దొంగతనం చెయ్యాలి అనుకుంటారా అని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు సుభాష్ తను చేసిన తప్పుకి రాజ్ శిక్ష అనుభవిస్తున్నాడని బాధపడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |